అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్..పీఆర్సీపై కీలక ప్రకటన

-

అంగన్వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఆర్సీపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించే పిఆర్సి లో అంగన్వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్న అంగన్వాడీల మెజారిటీ సమస్యలను తీర్చామని తెలిపారు.

KCR-3

మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది అని చెప్పారు. మిగతా డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 300 కోట్లతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండల్ నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని శంకుస్థాపన చేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని గత పాలకులు అబద్దంగా మార్చుతే, రైతే రాజు అని నమ్మిన సీఎం కెసిఆర్ గారు… రైతు ఆత్మహత్యలు కాదు ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news