గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 54 మంది విద్యార్థినులకు అస్వస్థత..!

-

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని గురుకుల పాఠశాలల్లో సమస్యలు అధికమవుతున్నాయి. సమస్యలతో విద్యార్థిని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో అయితే పాముకాటు వేసి విద్యార్థులు మరణించారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అధికారులను ఆదేశించినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారమవ్వడం లేదు.

తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 54 మంది విద్యార్థినీలు అస్వస్థత కు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పరామర్శించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఫుడ్ పాయిజన్ సంఘటన పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news