అవినీతి పరులకు, 50లక్షలతో దొరికిన దొంగలకు ప్రతీ పనిలో అవినీతి ఉంటుందని తెలివి తక్కువ ఆలోచన కొంత మందికి ఉంటదని.. వారికి పుట్టుకతో వచ్చిన బుద్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా మీడియాతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు గురించి మాట్లాడారు. ఏసీబీ ఆఫీస్ కి లాయర్ తో వెళ్తాను. ఏది అడిగితే అది చెబుతానని చెప్పారు. అక్రమ కేసు, తప్పు FIR అని కోర్టులో వాదించామని తెలిపారు.
నా మీద పెట్టిన కేసులో ఏమి లేదు.. లొట్టపీసు కేసు. రాజ్యాంగ పరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. అవినీతి లేదని తెలిసి కూడా నా మీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని హైకోర్టుకి వెళ్తామని తెలిపారు. కొంత మంది మంత్రులు వాల్లే న్యాయమూర్తులలాగా వ్యవహరిస్తున్నారు. ట్రయల్ న్యాయ స్థానంలోనే జరుగుతది అన్నారు.