అది లొట్టపీసు కేసు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తనపై పెట్టిన కేసులో ఏమి లేదని.. అదో లొట్టపీసు కేసు అని కేటీఆర్ వెల్లడించారు. తాజాగా తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీ విషయం అవినీతిలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి లేదని తెలిసి తనపై కేసు పెట్టి కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటే పారిపోయారు.

రాజ్యాంగ పరంగా ప్రతీ హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. క్వాష్ పిటిషన్ కొట్టేసినందుకు నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారు. మంత్రులకు అంత ఉలిక్కి పాటు ఎందుకు అని ప్రశ్నించారు. హైకోర్టు అనుమతిస్తే.. లాయర్లతో విచారణకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన ప్యాలెస్ లో చర్చ పెట్టినా తాను మీడియాతో సిద్దమేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news