పోడు భూములపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష

-

పోడు భూములపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పోడు భూముల సమస్యలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ తో పాటు అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ డోబ్రియాల్ సహా అటవీ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పోడుభూములపై తలెత్తే సమస్యలను కొండా సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక మధ్యాహ్నం ఎంసీహెస్ఆర్డీలో ఆషాఢమాస బోనాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news