మాజీ సీఎం జగన్ కు షాక్.. లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!

-

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కుటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 164 సీట్లలో విజయ కేతనం ఎగురవేసిన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లలో విజయం సాధించి ఘర పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో సీఎం సెక్యూరిటీ కోసం జూబ్లీహిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. ఏకంగా జేసీబీతో నిర్మించని గదులను నెలమట్టం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news