HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు జారీ అయ్యాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ తరుణంలోనే శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు చేశారు అధికారులు. HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బీనామీలు గా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందాయి. మరింత లోతుగా విచారించేందుకు విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. శివ బాలకృష్ణ ఆస్తులు లావాదేవీలు నిలిపివేయాలని కలెక్టర్ కి లేఖ రాసింది ఏసీబీ.
దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాలు ఆధారంగా విచారణ చేస్తోంది ఏసీబీ. ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలో చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనున్న ఏసీబీ….శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు గుర్తించింది. అలాగే..2021 నుంచి 2023లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణ కు ఉన్న 57 ఎకరాల భూమిపై విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు.