బీఆర్ఎస్ పార్టీకి రామగుండం మాజీ మేయర్ రాజీనామా !

-

బీఆర్ఎస్ పార్టీకి రామగుండం మాజీ మేయర్ రాజీనామా చేశారు. రామగుండం మాజీ మేయర్ జాలి రాజమణి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశారు. ఈ మేరకు తన రాజీనామ లేఖను సీఎం కేసీఆర్ కి పంపినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలో జాలి రాజమణి కాషాయం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందుతోంది.

brs party

కాగా రాజమణి గతంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేశారు.. ఆ గ్రూప్ లో 20వేల మంది మహిళలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. కాగా, ఈనెల 30న తాను బిజెపిలో చేరబోతున్నట్లు మాజీ మంత్రి సి.కృష్ణా యాదవ్ ప్రకటించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కిషన్ రెడ్డి, కే. లక్ష్మణ్, ఈటెల రాజేందర్ సమీక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు. అంబర్పేట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు రెండుసార్లు అవకాశం ఇవ్వలేదని, ఇతర పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కెసిఆర్ కు లేఖ పంపినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version