రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్ లైన్ విధించారు. దసరా పండగలోపు రుణమాఫీ చెయ్యకపోతే మొత్తం తెలంగాణ వచ్చి నీ సెక్రటేరియట్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు హరీష్ రావు. రుణమాఫీ కాని వాళ్ళంతా రండి అంటే.. ఒక్క నగునూరు మండలంలోనే వేల సంఖ్యలో రైతులు వచ్చారన్నారు.
కళ్ళు మూసుకుపోయిన రేవంత్.. ఒకసారి ఈ రైతులను చూడని చురకలు అంటించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు రైతు ధర్నా వేదికగా గర్జన సందర్భంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ తగ్గిందని… కాలేశ్వరం కూలిపోయింది అన్నాడు ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చూడాలని కోరారు. రేవంత్ రెడ్డికి కూలకొట్టడం తప్ప కట్టడం తెలవదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అబద్ధమాడింది… నేను గట్టిగా ప్రశ్నిస్తే నన్ను తిట్టడం మొదలుపెట్టాడన్నారు.