ఎనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు పేల్చారు. నంగనూరులో రైతు రుణమాఫీపై ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు…అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ వచ్చాక రైతు విలువ తగ్గిందని… కాలేశ్వరం కూలిపోయింది అన్నాడు ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చూడాలని కోరారు.
రేవంత్ రెడ్డికి కూలకొట్టడం తప్ప కట్టడం తెలవదని… అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అబద్ధమాడిందని ఆగ్రహించారు. నేను గట్టిగా ప్రశ్నిస్తే నన్ను తిట్టడం మొదలుపెట్టాడు…నాకు ఎమ్మెల్యే పదవి కంటే మీ అందరి సంతోషమే నాకు ఎక్కువ అన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు మరో డెడ్ లైన్ విధించారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు హరీష్ రావు.