TDP ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రా, తెలంగాణ నా అడ్డా అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడినా నేను గెలుస్తానని వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. తుళ్లూరు సమీపంలో బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. “ఇవాళ మంచి రోజు దానికి వాతావరణం కూడా సహకరించింది.

మంచి కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనడానికి ఇదే నిదర్శనం” అంటూ బాలకృష్ణ మాట్లాడారు. అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే దిశగా ముందడుగులు వేస్తున్నారని సంతోషపడుతున్నారు. ఇదిలా ఉండగా… హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నిరుపేదలకు మంచి చేస్తున్నారు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.
ఆంధ్రా, తెలంగాణ నా అడ్డా
రెండు రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడినా నేను గెలుస్తాను
– ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ pic.twitter.com/ghNTs62RWD
— BIG TV Breaking News (@bigtvtelugu) August 13, 2025