నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయనతో పాటు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం ఉంది. ఇక ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజల్ని రైతులని ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు బృందం రావడం జరిగిందని వెల్లడించారు.
ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదని.. ప్రజలకు ధైర్యం చెప్పవలసిన ముఖ్యమంత్రి రెండు రోజుల పత్తా లేకుండా పోయి తన తప్పును దాచిపెట్టుకోడానికి కేసీఆర్ గారిపై, మా పార్టీ పై విమర్శలు చేశారని ఆగ్రహించారు. పెళ్లికి చావుకి తేడా తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారు.. ఓదార్పు కొచ్చారా సంబరాలకు వచ్చారా అర్థం కాలేదని మండిపడ్డారు.