నల్గొండ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ రైతు ధర్నా ఇవాళ జరగాల్సి ఉండగా.. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 24 వరకు గ్రామ సభలు ఉండటంతో సెక్యూరిటీని కేటాయించాలమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి చెందిన మంత్రి కోమటి రెడ్డి అనుచరులు.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తాజాగా నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి చేశారు. కంచర్ల భూపాల్ రెడ్డి పై దాడి చేసారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ దాడిలో సొమ్మసిల్లి పడిపోయాడు కంచర్ల భూపాల్ రెడ్డి. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల ముందే మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.