మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..!

-

కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2018లో పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ పోటీ చేసి రేవంత్ రెడ్డిని ఓడించిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనే విజయం సాధిస్తారని బీఆర్ఎస్ భారీగానే ప్రచారం చేసింది. కానీ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి కావడంతో ప్రజలు రేవంత్ రెడ్డికే పట్టం కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయానికి మొగ్గు చూపించారు ప్రజలు.

కోడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్రకు పోలీసులు బ్రేకులు వేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వాస్తవానికి పాదయాత్రకు అనుమతి లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డిని కోడంగల్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక  అక్కడి నుంచి షాద్‌నగర్ వైపు మళ్లిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version