మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్..!

-

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. సీఎం రేవంత్ స్టేషన్ ఘన్పూర్ పర్యటనను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు రాజయ్య. బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి వద్ద చేరారని రాజయ్య ఆరోపణలు చేస్తున్నారు.

Former MLA Tatikonda Rajaiah under house arrest

కడియం శ్రీహరి చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సీఎం టూర్ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని ప్రకటించారు బీఆర్ఎస్ మాజీ MLA తాటికొండ రాజయ్య. రేవంత్ రెడ్డి.. తుగ్లక్ ముఖ్యమంత్రి అని… రేవంత్ రెడ్డి భారతదేశంలోనే అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version