ఎ.ఆర్. రెహమాన్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఎ.ఆర్. రెహమాన్ ఛాతి నొప్పి వచ్చిందని అంటున్నారు. దీంతో వెంటనే ఎ.ఆర్. రెహమాన్ ను ఆస్పత్రిలో చేర్పించారట ఆయన వ్యక్తిగత సిబ్బంది. ఎ.ఆర్. రెహమాన్ అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారట. ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు.
ఈ తరుణంలోనే… వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక ఎ.ఆర్. రెహమాన్ ఛాతి నొప్పి వచ్చిందన్న వార్తలు బయటకు రావడంతో.. ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.