BREAKING : ఎల్లుండి టిఆర్ఎస్ పార్టీలో చేరనున్న రాపోలు ఆనంద భాస్కర్

-

తెలంగాణ బిజెపి పార్టీకి వరుసగా బిగ్ షాకులు తగులుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ నుంచి బూర రాజయ్య గౌడ్ ను బిజెపి లాగితే… తామేమి తక్కువ తినలేదంటూ దాసోజు శ్రవణ్ మరియు స్వామి గౌడ్ లను లాగేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. అక్కడితో ఆగకుండా మరో వికెట్ పడగొట్టింది టిఆర్ఎస్ పార్టీ.

బిజెపి సీనియర్ లీడర్ రాబోలు ఆనంద భాస్కర్ బుధవారం రోజున అంటే ఎల్లుండి బిజెపి పార్టీకి రాజీనామా చేయనున్నారు. బిజెపికి రాజీనామా చేసిన అనంతరం అదే రోజున సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు. తాను బీజేపీకి రాజీనామా చేసి టీ(బీ).ఆర్‌.ఎస్ లో చేరుతాన‌ని సీఎం కేసీఆర్ తో చెప్పారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అద్భుతంగా ఉన్నాయ‌ని ఆనంద భాస్క‌ర్ కొనియాడారు. భారత రాష్ట్ర స‌మితి ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version