మేడిగడ్డ బ్యారేజీలో నాలుగు గేట్ల తొలగింపు

-

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో గేట్లను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. 20, 21 గేట్లను పూర్తిగా తొలగించాలని నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్‌.డి.ఎస్‌.ఎ.) సూచించింది. ఏడో బ్లాక్‌లో ఏడు గేట్లను ఎత్తే ప్రక్రియ మిగిలి ఉంది. 18, 19, 20, 21 పియర్‌ల గేట్లు ఎత్తడానికి వీలు లేకపోవడంతో వాటిని కట్‌ చేసి తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. శనివారం రోజున 20వ గేటు కటింగ్‌ పనులను ప్రారంభించారు. ఈ బ్లాక్‌లోని మిగిలిన మూడు గేట్లు ఎత్తడానికి వీలుగా ఉన్నట్లు సమాచారం.

బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్‌ ప్రాంతంలో భారీగా నీటి ఊటలు వస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని గుర్తించి, నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో రోజుకో సమస్య ఎదురవుతోంది. మూసిఉన్న గేట్లను ఎత్తే ప్రక్రియలో భాగంగా 15వ గేటును ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తారు. 16వ గేటు ఎత్తే క్రమంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మిగతా గేట్లను ఎత్తడానికి సమాయత్తం అవుతూనే.. ఏడో బ్లాక్‌ ప్రదేశంలో పునరుద్ధరణ చర్యలను కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news