దారుణం.. లేడీ లెక్చరర్‌గా నమ్మించి ఏడుగురు అమ్మాయిలపై అత్యాచారం!

-

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్‌లో మహిళా లెక్చరర్‌గా నమ్మించి. స్కాలర్‌షిప్‌ పని పేరిట విద్యార్థినులను పిలిపించి, వారిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం చేసినట్లు వెలుగులోకి రాగా.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల్లో చాలామంది గిరిజనులే ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. సీధీ జిల్లాకు చెందిన బ్రజేశ్‌ ప్రజాపతి (30).. యాప్‌ సాయంతో ఓ కళాశాల మహిళా లెక్చరర్‌గా గొంతు మార్చి, స్కాలర్‌షిప్‌ పని ఉందంటూ విద్యార్థినులకు ఫోన్‌ చేసేవాడు. అది నిజమని నమ్మి వచ్చిన బాలికలను తన బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి వద్ద నుంచి ఫోన్‌ లాక్కొని పరారయ్యేవాడు. ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు మే 16న తొలి కేసు, అనంతరం మరో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నించగా.. ఏడుగురిపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో అతడు అంగీకరించాడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news