తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. తెలంగాణ మొత్తంలో 561 గ్రామాల్లో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే… లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు. మార్చి 31 లోపు అన్ని గ్రామాల్లో అర్హులందరికీ నాలుగు పథకాలు అమలయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.
ప్రతి గ్రామంలో ఏకకాలంలో నాలుగు పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. వెను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు పడనున్నాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందనున్నాయి.
561 గ్రామాల్లో లబ్ధిదారుల సంఖ్య ఒకసారి పరిశీలిస్తే…
రైతు భరోసా – 3, 07,318
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – 20,336
కొత్త రేషన్ కార్డులు – 42, 267
ఇందిరమ్మ ఇండ్లు – 72, 406