తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పద్మ అవార్డుల కేటాయింపులో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ఎంపీ చామల విమర్శించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా కేంద్రం వివక్షత చూపుతూనే ఉందని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం సిఫార్సు చేసిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించడం దారుణమని, కేంద్రం మరోసారి తెలంగాణ ప్రజలను అవమానించిందని ఆయన మండిపడ్డారు. ఇదిలాఉండగా, పద్మ అవార్డుల ప్రకటనలో కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నదని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టంచేశారు.