తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతోంది. బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధం అయ్యారట. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రజా పాలనలో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెలాఖరులోగా పథకం అమలుపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. కాగా వేలాదిమంది కొన్ని నెలలు, ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. GHMC పరిధిలోనే ఏకంగా రూ. 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా క్లియర్ చేయకపోతే వారికి పథకం అమలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు.
కాగా, ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహం 3 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఉంది. సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా అభయ హస్తం దరఖాస్తులపై చర్చ జరుగనుంది. ఇక ఇప్పటికే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తుంది సిబ్బంది.