ఎయిడ్స్ రోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోందని.. హెచ్. ఐ. వీ వ్యాధిగ్రస్థులకు నెలకు ఆసరా పెన్షన్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు మంత్రి హరీష్ రావు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో ఇవాళ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…. ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1 న ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుతున్నారని… అవగాహన పెరగటం వల్ల 90 శాతం మరణాలు తగ్గాయన్నారు.
ఎయిడ్స్ బాధితులను చిన్న చూపడం వద్దని…. ఇప్పటికీ వివక్ష చాలా తగ్గింది… ఇంకా తగ్గాలని తెలిపారు. గాలి ద్వారా, ముట్టుకుంటే ఎయిడ్స్ రాదని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో ఎయిడ్స్ శాతం 0.7, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేపట్టిన నిరోధక చర్యల వల్ల 0.7 నుండి 0.4 శాతానికి తగ్గిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎయిడ్స్, షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు హైదరాబాద్, వరంగల్ లో ఏర్పాటు చేస్తున్నామని… ఎయిడ్స్ కంట్రొల్, చికిత్స, అవగాహన కోసం ప్రభుత్వం 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నదని వివరించారు. హై రిస్క్ గ్రూప్ వారిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిడ్స్ పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థల పాత్రల కీలకమైందని… ప్రభుత్వం, ఎన్జీవోలు, ప్రజలు అందరు కలిసి ఎయిడ్స్ మహమ్మారిని తరిమేయాలి. బాధితులను అందరం కలిసి కాపాడుకోవాలని కోరారు.