మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇచ్చుకుంటున్నారు : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

-

నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నేడు హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కేవలం 3 నియోజక వర్గాలకు మాత్రమే నిధులు వచ్చేవని, కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుందని.. పాలనలో గులాబీ పార్టీ, హస్తం పార్టీ రెండూ ఒకటేనని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కేవలం వారి మంత్రుల నియోజక వర్గాలకు మాత్రమే నిధులు ధార పోస్తున్నారని, ఇలా అయితే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తమ నియోజక వర్గాలు అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని ఆరోపణలు చేశారు. రేవంత్ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను పక్కన పెట్టిందని, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇంతవరకు చనాఖా-కొరటా ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రభుత్వాన్నినిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news