Gadala Srinivas Rao : బీఆర్‌ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగలింది. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ చేరనున్నారని సమాచారం. అంతేకాదు… ఖమ్మం, సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారట గడల శ్రీనివాస్. గతంలో కొత్తగూడెం టికెట్ ఆశించారు మాజీ డిహెచ్ గడల శ్రీనివాస్.

టికెట్ హామీ ఇచ్చి చివరి నిమిషంలో వనమాకు ఇచ్చారు కేసీఆర్. దీంతో మనస్థాపానికి గురైన గడల ప్రస్తుతం లాంగ్ లీవ్ లో ఉన్నారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్ ను ఆయన ఆశిస్తున్నారు. ఆయన తరపున ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు.