గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు…గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి కల్పించింది. గద్వాల ఎమ్మెల్యే వ్యవహరం పై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. గద్వాల ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటించడం పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించారు డీకే అరుణ. ఈ తరుణంలోనే.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు డీకే అరుణ. కానీ ఈ తరుణంలోనే… గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు…గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి కల్పించింది.