రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో బీజేపీ నేత కుమారుడు!

-

రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కలకలం రేపింది. దీంతో రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కుమారుడు అరెస్ట్‌ అయ్యాడు. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో శేరిలింగంపల్లి బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు మంజీర మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్ పట్టుబడ్డాడు. గచ్చిబౌలి లోని రాడిసన్ స్టార్ హోటల్లో నిన్న అర్ధరాత్రి విందు జరిగింది.

ఈ సందర్భంగా మత్తు పదార్థాలు అయిన కొకైన్ స్వీకరించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే… బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు మంజీర మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్ తో పాటు..అతని స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ డ్రగ్ పార్టీలో ఎంత మంది పాల్గొన్నారనే దానిపై విచారిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news