ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య పోరుతో గాజాలో తీవ్ర సంక్షోభం నెలకొంది. యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొనడంతో పౌరులు ఆకలితో అల్లాడుతున్నారు. తినడానికి తిండి దొరకక చివరకు కలుపు మొక్కలను తింటున్నారు. కఠినమైన పొడి నేలలో స్వేచ్ఛగా పెరిగే మాలో అనే మొక్కను వారు ఆహారంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ మొక్కకు ఔషధ గుణాలు ఉన్నాయని గాజా పౌరులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలోకి తగినంతగా సహాయక సామగ్రి రావడం లేదు. వేరే గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సిన పరిస్థితి తలెత్తిందని గాజా పౌరులు వాపోతున్నారు. ఇజ్రాయెల్ దాడులతో ఉత్తర ఎటు చూసినా శిథిలాలమయంగా కనిపిస్తున్న గాజాలో.. నీరు, ఆహారం, ఔషధాల కొరత అక్కడ నెలకొంది. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా ఉన్న తాము మరో గత్యంతరం లేక కలుపు మొక్కలను తినాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు వాటినే తినిపిస్తున్నట్లు తెలిపారు.