ఇవాళ్టి నుంచి 17 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. భాగ్యనగరంలో గణేష్ చతుర్థి ఉత్సవాలకు సర్వం సిద్దం అయింది. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. అయోధ్య రామ మందిరంలో బాలాపూర్ గణేష్ ఏర్పాటు చేశారు. ఈ సారి రామ మందిర మండపం తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలాపూర్ గణేష్. దీంతో బాలాపూర్ రామమందిర మండపం..భక్తులను ఆకట్టుకుంటున్నారు.
బాలాపూర్ గణపతి అంటే మొదటగా గుర్తొచ్చేది లడ్డూ వేలం అన్న సంగతి తెలిసిందే. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలో ప్రత్యేక స్థానం దక్కింది. 1994లో మొదటగా ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రతి యేటా పోటా పోటీగా ఎంతో రసవత్తరంగా లడ్డూ వేలం కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. వేలం లో లడ్డూ దక్కించుకున్న వారికి అష్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అన్న మాట.