5 సార్లు పీయూష్ గోయల్ ను కలిసా..ప్రతిసారీ అవమానించాడు : గంగుల కమలాకర్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. పీయూష్ గోయల్ ను మంత్రిగా నేను 5 సార్లు కలిసాను.. ప్రతి సారి సమావేశంలో పీయూష్ గోయల్ మమ్మల్ని అవమానించారు…అయినా తెలంగాణ కోసం భరించామని గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని… ఫిబ్రవరి , మార్చిలో రెండు సార్లు తెలంగాణ అధికారులు కేంద్రం పెట్టిన సమావేశంకు హాజరు అయ్యారని ఫైర్ అయ్యారు.

కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి ఎవరి తరపున మాట్లాడ్తున్నారు ? అని నిలదీశారు. పారా బాయిల్డ్ ఇవ్వమని మా మెడపై కత్తి పెట్టి కేంద్రం మా దగ్గర నుంచి లేఖ తీసుకుందన్నారు. కిషన్ రెడ్డి ప్రతి గింజ కొంటాం అంటారు…మరోవైపు ముడి బియ్యం కావాలని అంటున్నారని మండిపడ్డారు.  తెలంగాణ లో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి కేంద్రంను ఎందుకు కొరరు ? అని నిలదీశారు.  ఒక్క సారి అయిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి రాలేదు…ముందు గాని తర్వాత గాని కలుస్తారు.. కేంద్రం కాలానుగుణంగా కొత్త ఆలోచనలు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version