పీయూష్ గోయల్ ది కండ కావరమని..తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎలా నూకలు తినమంటాడు ? అని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో మేము అవమానాలు పడ్డామని.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తెలంగాణ ప్రజలపై అవమానకరంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు.
అది మాకు చాలా ఆవేదన …బాధ కల్గించిందని పేర్కొన్నారు.
పక్కా వ్యాపారి మాట్లాడినట్టు కేంద్ర మంత్రి పీయూష్ మాట్లాడారని.. పిడిఎస్ లో నూకల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని పీయూష్ గోయల్ మాకు సలహా ఇచ్చారని అగ్రహించారు. పీయూష్ గోయల్ ఖబడ్దార్ …తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి …ఆ కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది …ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అగ్రహించారు.
ఎవరు ధాన్యం కొనుగోలు చేయాలో రేవంత్ రెడ్డికి తెలియదా ? కేసీఆర్ వడ్లు కొనాలని రేవంత్ అంటాడని నిప్పులు చెరిగారు. కేంద్రంను తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ ఎందుకు అడగడు ? అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బిజెపి లు ములాఖత్ అయ్యాయా ? బిజెపిని అడగకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం రేవంత్ చేస్తున్నాడని మండిపడ్డారు.