రైతుల పక్షాన, ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం అవుతోంది. ఉగాది తరువాత నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఉంటాయని… ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం మెడలు వంచుతామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని గ్రామపంచాయితీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, అన్ని మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు వ్యవసాయం ఉన్న చోట్ల తీర్మాణాలు చేయాలని.. తీర్మాణాలను ప్రధాని పంపాలని నిరంజన్ రెడ్డి అన్నారు.
ఉగాది తరువాత కేంద్రంపై పోరాటమే… ప్రధాని మోదీ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది: నిరంజన్ రెడ్డి
-