గ్రేటర్ ప్రజలకు శుభవార్త.. రేపటి నుంచే ఇళ్ల పంపిణీ..70వేల మందికి లబ్ధి !

-

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకంగా లక్ష డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలకు కానుకగా అందించేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… అందులో భాగంగానే ముందుకు సాగుతుంది.

నిర్మాణాలు పూర్తి చేసుకున్న 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఇందులో భాగంగా శనివారం ఒక్కరోజు ఏ విధంగా 11, 700 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులకు డబుల్ బెడ్ ఇండ్లను అందజేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. లాటరీ పద్ధతిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version