మరో రెండు గంటల పాటు ఎవరూ బయటకు రావొద్దు : జీహెచ్ఎంసీ

-

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతోంది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురిసింది. వనస్థలిపురం, బీఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులపైకి వరద పోటెత్తింది. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరింది.

మరో రెండు గంటల పాటు నగరంలో భారీ వర్షం కురుస్తుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బందిని అలర్ట్ చేసినట్లు తెలిపింది. రెండు గంటల పాటు ప్రజలెవరూ అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. వర్షాలు, వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667 సంప్రదించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version