గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి

-

హైదరాబాద్లో బోనాల సంబురం షురూ అయింది. నగరంలోని గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద ఇవాళ బోనాల సందడి నెలకొంది. ఉదయాన్నే మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.

దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈ సారి ప్రభుత్వం బోనాలను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి నేటి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు, ఆదివారాల్లో బోనాలను నిర్వహించనున్నారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. నేడు తొలిపూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇవాళ నుంచి ఆగస్టు 4 వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగనున్నాయి. అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి.. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news