WWEకి జాన్‌ సీనా గుడ్‌బై.. చివరి పోరు ఎప్పుడంటే?

-

ప్రముఖ WWE రెజ్లర్‌ జాన్‌ సీనా రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెసల్‌ మేనియా తన చివరి పోటీ అని ఆయన తెలిపారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మనీ ఈవెంట్‌కు హాజరైన సీనా ఈ ప్రకటన చేయడంతో అంతా షాక్ అయ్యారు. 2001లో రెజ్లింగ్‌లోకి అరంగేట్రం చేసిన జాన్ సీనా.. ఇప్పటివరకు 16 సార్లు WWE ఛాంపియన్‌గా నిలిచారు. మరోవైపు నటనలోనూ తన సత్తా చాటారు. కొన్ని హాలీవుడ్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న జాన్ సీనా.. టీవీ షోల్లోనూ సందడి చేశారు.

‘‘దాదాపు రెండు దశాబ్దాలకుపైగా రెజ్లింగ్‌లో ఉన్నా. ఎన్నో అనుభవాలను ఆస్వాదించా. ఇప్పుడు వీడ్కోలు నిర్ణయం తీసుకొనేందుకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నా. డబ్ల్యూడబ్ల్యూఈకి ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేం. ఎల్లవేళలా మద్దతుగా నిలిచే అభిమానులే కీలకం. వారి వల్లే కెరీర్‌లో ఉన్నత స్థానాలకు వెళ్లగలం. నా రెజ్లింగ్‌ కెరీర్‌లో తెలుసుకొన్నది ఒక్కటే. కెనడావాసులు ఎప్పుడూ రెజ్లింగ్‌ను ఆదరిస్తూనే ఉంటారు’’ అని ఈ సందర్భంగా జాన్ సీనా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news