మ‌గువ‌ల‌కు షాక్.. మ‌రోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి ధ‌ర‌లు సామాన్యుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. స‌రిగ్గా పెళ్లీల సీజ‌న్ వ‌చ్చిన వెంట‌నే బంగారం, వెండి ధ‌ర‌లు ఆకాశాన్ని అంటాయి. తాజాగా ఇప్పుడు మ‌రోసారి ధ‌ర‌లు పెరుగుతున్నాయి. సామాన్య‌లు.. బంగారం, వెండికి దూరం అయ్యేలా ధ‌రలు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వ‌రుస‌గా రెండు రోజులు పెరిగిన బంగారం ధ‌ర‌లు.. మూడో రోజు కూడా ప్ర‌తాపం చూపించాయి.

ఈ రోజు 10 గ్రాముల బంగారం పై రూ. 350 నుంచి రూ. 390 వ‌ర‌కు ధ‌ర‌లు పెరిగాయి. దీంతో బంగారం ధ‌ర రూ. 54 వేల మార్క్ కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. అలాగే కిలో గ్రాము వెండి ధ‌ర అయితే ఈ రోజు ఏకంగా రూ. 1,500 పెరిగింది. దీంతో వెండి ధ‌ర రూ. 74 వేల మార్క్ ను అందుకుంది. వ‌రుస‌గా మూడు రోజుల్లో వెండి ధ‌ర రూ. 2,700 వ‌ర‌కు పెరిగింది.

నేటి మార్పులతో తెల‌గాణ‌లోని హైద‌రాబాద్, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో విజ‌య‌వాడ న‌గ‌రాల్లో.. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల‌కు రూ. 49,350 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 53,840 కి చేరుకుంది. దీంతో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 74,200 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version