బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన ధరలు..

-

 

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 తగ్గి, రూ. 59, 020 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి, రూ. 54, 100 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 తగ్గి, రూ. 75, 700 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version