వంటగది అంటే కేవలం ఆహారం తయారు చేసే ప్రదేశం అని మాత్రమే కొందరు భావిస్తారు. ఇలాంటి అపోహలు ఉంటే పూర్తిగా పక్కన పెట్టేయండి. వంటగది అంటే అది ప్రేమ, ఆనందాలను మరింత ఎక్కువ చేసే అద్భుతమైన స్థలం. అవునండి నేను చెప్తున్నది నిజమే జీవిత భాగస్వామితో కలిసి వంట చేయడం ద్వారా ఒకరికొకరు దగ్గర అవ్వడమే కాకుండా, క్వాలిటీ టైం కూడా సేవ్ చేయొచ్చు. ఇంతే అనుకుంటున్నారా.. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం..
ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పార్ట్నర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఎవరికీ కుదరట్లేదు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకు దూరం అవుతున్నాం. అలాకాకుండా మీ పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయడానికి ఇంటి పనులు, ఆఫీస్ పనుల్లో సహాయం చేయడమే కాక కలిసి వంట చేయడం కూడ అలవాటు చేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.
బంధం బలపడుతుంది: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వంట చేయడం ద్వారా ఇద్దరి మధ్య ఉన్న బంధం బలపడుతుంది ఒకరి కూరగాయలకు కోస్తే, మరొకరు మసాలాలు సిద్ధం చేస్తే, ఇలా కలిసి పని చేయడం వల్ల ఒకరిపై ఒకరికి సహాయం చేయాలని భావన పెరుగుతుంది. ఈ సమయంలో ఒకరి బలాలు, బలహీనతలు తెలుస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇద్దరూ కలిసి వంట పూర్తి చేస్తే అందులో ఉండే ఆనందం ఇద్దరినీ దగ్గర చేస్తుంది.
సరదాగా సమయం గడపడం: వంట గదిలో ఇద్దరు కలిసి గడిపే సమయం లో సరదాగా కొత్త వంటకాలు ప్రయత్నించడం. ఒకరి రుచికి అనుగుణంగా మరొకరు వంట తయారు చేయడం చిన్న చిన్న తప్పులు చేసి నవ్వుకోవడం, వంటివి మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ సరదా క్షణలు,మీ ఒత్తిడిని తగ్గించి ప్రేమను పెంచుతాయి.
కమ్యూనికేషన్ తో లక్ష్యాలు తెలుసుకోవడం: వంట చేసేటప్పుడు ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మరింత దెగ్గర చేస్తాయి. రోజువారి జీవితంలో జరిగిన విషయాలు, ఒకరికొకరు చర్చించుకోవడానికి సమయం కుదురుతుంది. ఏదైనా చెప్పాలనుకుంటున్నా విషయాన్ని భాగస్వామితో చెప్పడానికి మంచి వేదికగా వంటగది మారుతుంది. అంతేకాక ఈ ఓపెన్ కమ్యూనికేషన్ మీ భవిష్యత్తు ప్రణాళికలను గురించి చర్చించడానికి, మీకు ఉండే లక్ష్యాలను పాట్నర్ తో పంచుకోవడానికి అనువైన స్థలంగా మారుతుంది.ఇలా ఇద్దరు కలిసి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని వండుకోవడం ఇద్దరికీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.
భాగస్వామితో కలిసి వంట చేస్తున్నప్పుడు ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేయడం వల్ల మరింత సరదాగా, సంతోషంగా ఉంటుంది. కిచెన్ లో కలిసి వంట చేయడం కేవలం ఆహారం తయారు చేయడం మాత్రమే కాదు ఇది ఇద్దరి మధ్య ప్రేమను అని ఆనందాన్ని పెంచే అద్భుతమైన అవకాశం.
మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీ భాగస్వామితో కలిసి వంట చేయడం మొదలు పెట్టండి.