తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డీఎస్సీ రాయాలంటే డిగ్రీలో ఉండాల్సిన కనీస మార్కుల శాతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేసింది. ఇకనుంచి జనరల్ కేటగిరి అభ్యర్థులకు 45 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. అటు ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే… డీఎస్సీ పరీక్ష రాయవచ్చు.
ఇప్పటివరకు జనరల్ కేటగిరి అభ్యర్థులకు 50 శాతం మార్పులు ఉండేవి. అటు ఇతరులకు 45 శాతం మార్పుల నిబంధనను అమలు చేసేది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం… ఐదు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా భాషా పండితులు, పి ఈ టి లకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. వారు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అయితే డీఎస్సీ మార్కుల శాతాన్ని తగ్గించడం పట్ల అభ్యర్థులు ఖుషి అవుతున్నారు.