పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. వేత‌నాలు పెంపు

-

పుర‌పాలికల్లో ప‌ని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో పారిశుద్ధ్య కార్మికుల‌కు ఇప్పుడు ఉన్న వేత‌నాల‌కు 30 శాతం వేత‌నాలు పెర‌గ‌నున్నాయి. గ‌త ఏడాది జూన్ 1 వ తేదీ నుంచి ఈ నిర్ణ‌యం అమలు అవుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వుల‌ను రాష్ట్ర పుర‌పాలక శాఖ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,804 మంది పారిశుద్ధ్య కార్మికుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. కాగ తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పుర‌పాలిక పారిశుద్ధ్య కార్మికుల‌కు వేత‌నాలు పెంచుతామ‌ని ఇప్ప‌టికే హామీ ఇచ్చింది. ఆ హామీని తాజా గా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చూస్తు నిర్ణ‌యం తీసుకుంది. కాగ ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉద్యోగులు అంద‌రికీ 30 శాతం వేత‌నాలు పెంచింది. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుల‌కు కూడా పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news