తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తాను ప్రయత్నించాను : కేటీఆర్

-

తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తాను ప్రయత్నించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా కేటీఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రిగా తన బావమరుదలకు కాంట్రాక్టులు ఇచ్చే పని చేయలేదన్నారు. అరపైసా అవినీతి కూడా చేయలేదు. ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే బీఆర్ఎస్ అడిగింది. విద్యుత్ చార్జీల పెంపు పై బీఆర్ఎస్ నిలదీసింది. రూ.50లక్షలతో తాను దొరకలేదని సీఎం రేవంత్ రెడ్డికి సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉందని తెలిపారు. లుచ్చ పనులు తాను చేయలేదని.. తెలంగాణ కోసం అవసరం అయితే చస్తాను తప్ప లుచ్చా పనులు చేయనని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ను పెంచడానికే ప్రయత్నించాను. ప్రపంచంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికే ఈ కార్ రేసింగ్.. ఇంకా ఎన్ని కేసులు అయినా పెట్టుకో.. భయపడేది లేదని పేర్కొన్నారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడి బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news