తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..!

-

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. డిగ్రీ విద్యార్థుల హాజరుకు మార్కులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఏడాదిలో 75% పైగా హాజరు ఉంటే పది మార్కులు ఇచ్చే అవకాశం ఉంది.

యాక్టివ్ గా ఉంటే విద్యార్థులను గుర్తించి, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది నిర్ధారించి మార్కులు ఇచ్చే యోచనలో ఉంది. ఓయూ పీజీలో ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అటు లా సెట్ కౌన్సిలింగ్ దరఖాస్తు ఫీజు గడువులు పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.ఈ దరఖాస్తు గడువును నవంబర్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారిక ప్రకటన చేసింది.

అయితే నవంబర్ 21వ తేదీన గడువు ముగియాల్సి ఉంది. కానీ రెండు రోజులపాటు ఆ గడువును పెంచింది. దీంతో లాసెట్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల బ్యాక్లాగ్ రిజల్ట్స్ ఇంకా రాకపోవడంతో…. వారు ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంతమంది చెబుతున్నారు. ఇక లా సెట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 30వ తేదీన సీట్లు కేటాయిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version