తెలంగాణ అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ సర్కార్. ఈ నెల నుంచే అర్చకులకు రూ.10 వేలు అందించనుంది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి పెరిగింది.
అలాగే ఈ ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 10వేల గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డిడిఎన్ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ. 6వేల నుంచి రూ. 10వేలకు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజలకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేడు 17,676 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది కేసీఆర్ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ 17,676 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.