తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..వారందరికీ యూనిఫామ్‌ లు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వచ్చే విద్య సంవత్సరంలో పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులందరికీ యూనిఫామ్ లు అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏకరూప దుస్తుల పంపిణీ, మన ఊరు-మనబడి కార్యక్రమంపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 121 కోట్లతో ఏకరూప దుస్తులను రూపొందించాలని చెప్పారు.