ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!

-

ఢిల్లీలో ఇవాళ కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి.   ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు.  ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ కు కృష్ణానీటి కేటాయింపు పై క్యాబినెట్లో ఇవాళ చర్చలు జరిగాయి. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. 

తెలంగాణలో రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ మధ్య నీటిని కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని ఆదేశించింది కేంద్ర క్యాబినెట్.    తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నీటి వివాదాల సమస్య పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news