అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై రెండోరోజు ఈసీ సమీక్ష

నగరంలో కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు ప్రకటన పర్యటన కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేకృత్వంలో నీ ఈసీ బృందం. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు అధికారులతో సమావేశం అయింది. జిల్లాల వారీగా ఎన్నికల సన్నాహకాలు, ప్రణాళికలను సమీక్షించనున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లు, ఎన్నికల ప్రణాళికలను అధికారులు వివరించనున్నారు.


ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, ప్రలోభాల విషయంపై ఈసీ ఎక్కువగా దృష్టి సారించనుంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓటర్ల జాబితా, డూప్లికేట్ ఓట్లు, తొలగింపు తదితర అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నందున వాటి విషయంపై ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, బందోబస్తు ప్రణాళికలు, సరిహద్దు నియోజకవర్గాల్లో పర్యవేక్షణ, చెక్ పోస్టులు తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు 14.72 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు కాగా, 3.39 లక్షల మందిని తొలగించారు. 10.95 లక్షలమంది ఓటర్ల వివరాలలో మార్పులు చేశారు. తుది ఓటర్ల జాబితాను ఇవాళ విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్.