నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 14,236 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

-

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌ మొదలైందనే చెప్పాలి. అంగ‌న్ వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల ఖాళీల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ప్రభుత్వం. తాజాగా ఫైల్ పై సంత‌కం చేశారు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీత‌క్క‌. 6399 అంగ‌న్వాడీ టీచ‌ర్లు, 7837 హెల్ప‌ర్ల పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్దం చేసింది. ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే నోటిఫికేష‌న్ జారీ చేయనున్నారు.

ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు  నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నున్నారు. మొత్తం 14,236 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నది ప్రభుత్వం.  తెలంగాణ లో ఈ స్థాయిలో అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువులను భ‌ర్తీ చేయ‌డం మొదటి సారి కావడం విశేషం. ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియతో మ‌రింత ప‌టిష్టంగా ప‌నిచేయ‌నున్నారు అంగ‌న్ వాడీలు.

Read more RELATED
Recommended to you

Latest news