గోవా వెళ్లే వారికి శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం..!

-

దేశవ్యాప్తంగా ఉన్న యువత అత్యధికంగా వెళ్లాలనుకునే టురిస్టు ప్రాంతాల్లో గోవాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి గోవాలు వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది యువకులకు ఈ టూర్ ను ఎప్పటికి ఓ కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ముక్యంగా హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు రైల్వే డిపార్ట్మెంట్ సికింద్రాబాద్ నుండి వాస్కోడిగామాకు బై వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా వెళుతుంది.

అలాగే వాస్కోడగామ నుంచి గురు, శని వారాల్లో బయల్దేరి సికింద్రబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ నుండి వాస్కోడగామా వరకు వెళ్లే ఈ బై వీక్లీ రైలు.. మధ్యలో కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ స్టేషన్లలో ఆగనున్నట్లు తెలుస్తుంది అలాగే రైలు సర్వీస్ కు సంబందించిన టికెట్ ధరలు వెబ్ సైట్లో చూడవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ నుంచి గోవాకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోడీతో పాటు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news