నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియర్ లైన్‌మెన్లకు శనివారం రాత్రి జెన్ కో ఆడిటోరియంలో మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిదన్నరేళ్లలో రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో 35,774 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 10,312.. ట్రాన్స్‌కోలో 4,403.. జెన్‌కో 3,689.. ఎన్‌పీడీసీఎల్‌లో 4,370 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు మంత్రి వెల్లడించారు. 13 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేశామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల ఆందోళలతో దిగివచ్చింది. కొంతకాలంగా తమ జీతాలు పెంచడంతో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అంగన్వాడీలతో స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్థిక మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చడంతో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలపై హామీ ఇచ్చారు.